ఆమదాలవలస:
పట్టణంలో ఏప్రిల్ 25 నుంచి మే 25 వరకు అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు సీఎంసీసీ అధ్యక్షుడు తమ్మినేని విద్యాసాగర్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కె.సుదర్శన్, కిరణ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆమదాలవలసలో టోర్నమెంట్ నిర్వహించనున్న మైదానాన్ని పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు అనువైన ఏర్పాట్లపై చర్చించారు. త్వరలో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కార్యక్రమంలో గంధం వేణు, సనపల మోహన సురేష్, కాట్ర సుధాకర్, నిమ్మగడ్డ శేషుకుమార్, సత్య బాల తదితరులు పాల్గొన్నారు.