
అమరులకు ఘనంగా నివాళి
● బొడ్డపాడులో ఘనంగా అమరుల సంస్మరణ సభ
పలాస: నాడు నక్సల్బరీ, శ్రీకాకుళం గిరిజనులు చేపట్టిన పోరాటాల కొనసాగింపే నేడు దండకారణ్యంలో జరుగుతున్న ఆదివాసీల పోరాటాలని విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ అన్నారు. పలాస మండలం బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద అమరుల బంధు మిత్రుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అమరవీరుల స్మా రక సభను నిర్వహించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన సభలో విరసం అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమరుల పోరాట బాటలోనే నేడు ప్రజలు పాల్గొని తమ సమస్యలను సాధించుకో వాలని పిలుపునిచ్చారు. దండకారణ్యంలో గిరిజనులు పెద్ద ఎత్తున సహ జ వనరుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నారని, అయితే పాలక వర్గాలు ఆ సంపదను కాజేయడానికి చూస్తున్నాయని విమర్శించా రు. మావోయిస్టుల ఏరివేత పేరుతో బూటకపు ఎదురు కాల్పులు జరుపుతూ అమాయకులైన ఆదివాసీలను చంపుతున్నారని, మణిపూర్ కంటే ఘోరంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 29న నిజ నిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాన్ని పర్యటించి అక్కడ పరిస్థితులను పరిశీలిస్తుందని అందుకు బుద్ధి జీవులంతా సహకరించి మద్దతు తెలిపాలని ఆయన కోరారు. ఈ సభ సందర్భంగా ముందుగా అమరవీరుడు అజాద్ తండ్రి లక్ష్మణరావు వే దిక ముందు అరుణ పతాకాన్ని ఎగురువేశారు. అ నంతరం జరిగిన కార్యక్రమంలో పీడీఎం నాయకుడు వై.కోటేశ్వరరావు, డీటీఎఫ్ నాయకుడు కోత ధర్మారావు, ఏఎంపీఎస్ నాయకుడు ప్రభాకర్, ఏబీ ఎం సహాయక కార్యదర్శి భవాని, జోగి కోదండరావు, దాసిరి శ్రీరాములు, తామాడ త్రిలోచనరా వు, బొడ్డపాడు యువజన సంఘం నాయకులు తా మాడ క్రాంతి, బత్తిన వాసు, బి.సింహాద్రి, దశరధ, రాజాం గుణవంతు పాల్గొన్నారు.