
మహేంద్రతనయలో పడి యువకుడి మృతి
మెళియాపుట్టి: మండలంలోని కొసమాల గ్రామానికి చెందిన పెద్దింటి సాయిరాజ్ సోమవారం మహేంద్రతనయ నదిలో పడి మృతిచెందాడు. గ్రామస్తులు, సంఘటనను చూసిన పలువురు ఒడిశా వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు.. కొసమాల గ్రా మానికి చెందిన పెద్దింటి సాయిరాజ్(25) తన వ్యక్తిగత పని మీద మరో స్నేహితునితో కలసి ద్విచక్రవాహనం పై ఒడిశాలోని బాగుసోల గ్రామానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బాగు సోల గ్రామానికి సమీపంలో మహేంద్రతనయ నదిలో స్నానానికి దిగాడు. ప్ర మాదవశాత్తు లోతైన ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేకపోయాడు. స్నేహితుని కేకలు విని అటుగా వెళ్తు న్న ఒడిశా వాసులు వెంటనే నదిలోకి దిగి సాయిరాజ్‌ను బయటకు తీశారు. అప్పటికే మృతి చెందడంతో ఒడిశాలోని గురండి పోలీసులకి సమాచారం ఇచ్చారు. వారు మృతుని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేసి కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఒడిశా పర్లాకిమిడి ఆస్పత్రికి తరలించారు.