
రోడ్డు పై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు
జలుమూరు: తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జోనంకి పంచాయతీ పరిధి గంగాధరపేటకు చెందిన ముద్దాడ అప్పన్న (38) తిలారు రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్ దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొట్టి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు జీఆర్‌పీ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతుడికి భార్య పావని, కుమారులు అనంత్, శ్రీధర్‌లు ఉన్నారు.
కడపలవాని గెడ్డపై పెరిగిన వరద నీరు
ఎల్ ఎన్ పేట: మండలంలోని తురకపేట–దబ్బపాడు గ్రామాల మధ్య ఉన్న కడపలవాని గెడ్డపై వరద నీటి ప్రవాహం పెరిగింది. కొన్ని రోజులు గా కురుస్తున్న వర్షాలకు దేశవాళీ వరద నీరు వచ్చి చేరిందని స్థానిక రైతులు చెబుతున్నారు. వరద నీరు చేరటంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెడ్డపై సుమారు అయిదు అడుగుల నీరు ప్రవహించటంతో దబ్బపాడు–తురకపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు.

ట్రాక్‌పై మృతదేహం