
అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎస్పీ జీఆర్ రాధిక
పాతపట్నం: జిల్లాస్థాయి సాఫ్ట్ టెన్నిస్ స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలు గురువారం ఉదయం 9గంటల నుంచి నిర్వహిస్తున్నామని జిల్లా సాఫ్ట్ టెన్నిస్ సంఘం అధ్యక్షుడు గురాడి అప్పన్న, గేమ్స్ పర్యవేక్షకులు పీడీ వై.శేఖర్‌బాబులు మంగళవారం తెలిపారు. ఈ ఎంపిక పోటీలు మండలంలోని కొరసవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నామని, అండర్–14, 17 విభాగంలో బాలబాలికలు ఎంపిక పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఎస్‌జీఎఫ్ బీవీ రమణ, ప్రధానోపాధ్యాయుడు బి.సింహాచలం, పీఈటీలు పోటీలను నిర్వహిస్తారని సంఘం అధ్యక్షుడు తెలిపారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
సోంపేట: సోంపేట పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాధిక మంగళవారం పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలనిపోలీసు అధికారులను సూ చించారు. వార్షిక తనిఖీల కార్యక్రమంలో రికార్డులు పరిశీలించారు. స్పందన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ రవి ప్రసాద్, ఎస్‌ఐ హైమావతి, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
28న సంజ్ఞల భాష దినోత్సవం
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ బధిరుల సంజ్ఞల భాషా దినోత్సవం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు బధిరుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఉంగటి సురేష్, రవికిరణ్‌లు తెలిపారు. కార్యక్రమం ఆ రోజున ఉద యం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిరంలో నిర్వహించనున్నామని, అనంతరం ర్యాలీ ఉంటుందని తెలిపారు.
బనారస్ ఎక్స్‌ప్రెస్ సేవల విస్తరణ
భువనేశ్వర్: రాష్ట్రంలో దక్షిణ, పశ్చిమ జిల్లాల్లో రైల్వే సేవలను మెరుగుపరిచే దిశగా రైల్వే శాఖ మరో అడుగు ముందుకేసింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సంబల్‌పూర్, బనారస్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను విశాఖపట్నం వరకు పొడిగించడానికి ఆమోద ముద్ర వేయడం విశేషం. ఈ రైలు టిట్లాగఢ్, రాయగడ మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ ప్రాంతాల నుంచి ప్రజలు తర చుగా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆస్పత్రులకు ప్రయాణిస్తుంటారు. దీంతో వీరి కి ఆ రైలు సర్వీసు బాగా ఉపయోగపడుతుంది. ఈ రైలు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, హతియా, రాంచీ, రౌర్కెలా, ఝార్సుగుడ, సంబల్‌పూర్ వంటి కీలకమైన జంక్షన్ల గుండా పరుగులు తీస్తుంది.