
వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విశ్వకర్మ పూజ చేస్తున్న దృశ్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విశ్వకర్మ జయంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఉదయం నిర్వహించిన వేడుకలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం కృష్ణదాస్ మాట్లాడుతూ విశ్వకర్మల కోసం ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో 26 లక్షల మంది పంచవృత్తుల వారున్నారని వారికి ప్రభుత్వం నుంచి అన్ని విధా లా సహాయ, సహకారాలు అందుతున్నాయని, మంచి జరిగితేనే తమను ఆశీర్వదించాలని సీఎం చెప్పారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ.కోటి ప్రభుత్వ నిధులతో ప్రత్యేకంగా విశ్వకర్మల కోసం సామాజిక భవన నిర్మాణం తమ హయాంలోనే జరిగినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో విశ్వకర్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, పార్టీ జిల్లా కార్యదర్శి శిమ్మ రాజశేఖర్, యువజన విభాగం అధ్యక్షుడు ఎంవీ స్వరూప్, ఉపాధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎన్ని ధనుంజయరావు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గంగు శారద, సుగుణారెడ్డి, గౌతమి, విశ్వబ్రాహ్మణ జిల్లా గౌరవాధ్యక్షులు సింహాద్రి ధనుంజయాచారి, డీఎస్‌కే ప్రసాద్, రత్నాల నర్సింహమూర్తి, కోటేశ్వరరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు.