నేడు మొదలు మరో తొమ్మిది రోజులు లంబోదరుని అష్టోత్తరాలు సుప్రభాతంలా వేకువన వినిపిస్తాయి. సంధ్యా సమయాలు విఘ్న నాయకుని మండపాల వీక్షణతో అందంగా గడుస్తాయి. రాత్రిళ్లు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పరిపూర్ణంగా ముగుస్తాయి. గజాననుడి ఆగమనానికి సిక్కోలు సిద్ధమైంది. చవితి సంబరాన్ని నిండు గుండెతో నిర్వహించుకోవడానికి మండపం వేసి మరీ సన్నద్ధమైంది. విఘ్న నాయకుడిని పూజ కోసం బిళ్వ పత్రాలు, మామిడి తోరణాలు, అర్చన సామగ్రి విక్రయాలతో మార్కెట్లన్నీ ఆదివారం కళకళలాడాయి. మరోవైపు మట్టి వినాయకుడినే పూజించాలంటూ
ఊరూవాడా ప్రచారాలు జరిగాయి.