
అలల ఉద్ధృతికి కోతకు గురువుతున్నతీరం
వజ్రపుకొత్తూరు: మండలంలోని మంచినీళ్లపేట తీరంలో అలల కల్లోలం ఎక్కువైంది. రోజురోజుకూ తీరం కోతకు గురవుతుండటంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా తీరం కల్లోలంగా మారి బురదతో కూడిన అలల తాకిడి ఎక్కువైంది. దీంతో సాధారణం కంటే 150 అడుగుల ముందుకు సముద్రం వచ్చింది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర తీరం కోతకు గురవుతోంది. దేవునల్తాడ, కంబాలరాయుడుపేట, డోకులపాడు, దిబ్బవానిపేటలో అలల ఉద్ధృతి పెరిగిందని మత్స్య కారులు కె.మోహనరావు, కొండరాజులు, గుంటు ధనరాజు, వల్లభరావు చెబుతున్నారు. తీరంలో చెట్లు సైతం కూలిపోయాయి. లంగరు వేసిన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తలిస్తున్నారు.
మంచినీళ్లపేటలో కోతకు గురవుతున్న తీరం