
పోలా భాను మృతదేహం
కాశీబుగ్గ: పలాస –కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌లో వివాహిత పోలా భాను(28) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. మృతురాలి భర్త స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని, శుక్రవారం ఉదయం సైతం గొడవ పడ్డారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ నాగిరెడ్డి, సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.