శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని కృష్ణాపార్కు వద్ద వివాహిత అదృశ్యమైనట్లు శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్ తెలిపారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌పురానికి చెందిన యువకునితో లావేరు మండలానికి చెందిన యువతితో పదిహేను రోజుల క్రితం వివాహం జరిగింది. భర్త వ్యవసాయం చేస్తుండేవాడు.
గత నెల 31న (మూడురోజుల క్రితం) నవదంపతులు దుస్తులను డ్రైవాష్ చేయించేందుకు కృష్ణాపార్కు సమీపంలో షాప్ వద్దకు వచ్చారు. అక్కడే ఆమె అదృశ్యమైనట్లు భర్త శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.