
సమావేశంలో మాట్లాడుతున్న శివశంకర్‌రెడ్డి
రణస్థలం : రసాయన కర్మాగారాల్లో ఉద్యోగులు, కార్మికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్‌రెడ్డి అన్నారు. పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఆంధ్రా ఆర్గానిక్స్ యాజమాన్యం ఆధ్వర్యంలో 52వ జాతీయ భద్రతా వారోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యాలు సూచించే భద్రతా ప్రమాణాలను ఉద్యోగులు, కార్మికులు విధిగా పాటించాలన్నారు. హెల్మెట్, షూ, గ్లౌజ్, కళ్లద్దాలు వంటివి ధరించాలన్నారు. అనంతరం భద్రతా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ జి.వి.ఆర్ నగేష్, జీఎం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.