వైభవం.. బ్రహ్మరథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. బ్రహ్మరథోత్సవం

May 2 2026 11:43 AM | Updated on May 2 2026 11:43 AM

రొళ్ల: మండలంలోని కాల్వేపల్లిలో వెలసిన లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయంలో విశేష పూజలు, హోమాలు జరిగాయి. అనంతరం లక్ష్మీదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవ మూర్తులను రథంపైకి చేర్చి గోవిందనామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. ఉత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కై వాడస్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా శనివారం వసంతోత్సవం, 101 ప్రసాద వినియోగం, అన్నదానం కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement