హిందూపురం: ద్విచక్ర వాహనాలపై దూసుకెళుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు జరిమానా విధించారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురంలోని బజారు వీధిలో శనివారం సాయంత్రం రెండో పట్టణ సీఐ అబ్దుల్ వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వేర్వేరు ద్విచక్ర వాహనాలపై శరవేగంగా వచ్చిన ఇద్దరు మైనర్లను గమనించి అడ్డుకున్నారు. విచారణలో వారికి 18 ఏళ్లు కూడా పూర్తి కాలేదని తెలుసుకుని పీఎస్‌కు పిలుచుకెళ్లారు. అనంతరం తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు పిలిపించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు గాను ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. కౌన్సెలింగ్ అనంతరం ఇళ్లకు పంపారు. మైనర్లు వాహనాలతో రోడ్డెక్కితే ఊరుబోమన్నారు.


