●ఉత్సాహంగా సాగిన ‘రన్‌’ | - | Sakshi
Sakshi News home page

●ఉత్సాహంగా సాగిన ‘రన్‌’

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

హిందూపురం: ఈస్టర్‌ పర్వదిన రాకను పురస్కరించుకుని శనివారం హిందూపురం పురవీధుల్లో ‘రన్‌ ఫర్‌ జీసెస్‌’ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎ.నాగేంద్ర కుమార్‌ అధ్యక్షతన స్థానిక సీఐజీ మిషన్‌ చర్చి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో హిందూపురం పాస్టర్‌ ఫెలోషిప్‌ ప్రెసిడెంట్‌ రెవరెండ్‌ డాక్టర్‌ ఎన్‌.డేవిడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, టు టౌన్‌ సీఐ అబ్దుల్‌కరీం ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మెయిన్‌రోడ్డు మీదుగా సీఐజీ చర్చి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిలు మాట్లాడారు. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్దాలను వెంటనే ఆపాలని, శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు, చిన్నారులు అలరించారు. కార్యక్రమంలో చర్చి సెక్రెటరీ బి.జయరాజు, యునైటెడ్‌ పాస్టర్స్‌ అండ్‌ క్రిస్టియన్‌ లీడర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.సూర్యప్రకాష్‌, సెక్రెటరీ జాన్సన్‌, పాస్టర్లు ఇజ్రాయిల్‌ రాజు, దేవరాజ్‌, సీఐజీ మిషన్‌ చర్చి పాస్టర్‌ కె.రవి కిరణ్‌, జాయింట్‌ సెక్రెటరీ అరుణ్‌ కుమార్‌, ట్రెజరర్‌ సాల్మన్‌ రాజ్‌, జాయింట్‌ ట్రెజరర్‌ దేవరాజు, బోర్డు సభ్యులు ఆంజనేయులు, రూబేన్‌ పాల్‌, జార్జి బాబు, లైఫ్‌ వరల్డ్‌ ఉదయ్‌ కుమార్‌, డేనియల్‌, శ్రీరాములు, శ్యాంబాబు, సంఘ సభ్యులు, యూత్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సాంస్కృతి ప్రదర్శనతో అలరిస్తున్న విద్యార్థులు

మాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement