ఆకట్టుకుంటున్న ‘అయోధ్య రామ మందిరం’ | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘అయోధ్య రామ మందిరం’

Mar 27 2026 9:45 AM | Updated on Mar 27 2026 9:45 AM

తనకల్లు: శ్రీరామనవమిని పురస్కరించుకుని తనకల్లు మండలం పెద్దపల్లి వద్ద 89 అడుగుల ఎత్తుతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన అయోధ్య శ్రీరామమందిరం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన డాక్టర్‌ ముక్తియార్‌బాషా ఆధ్వర్యంలో ఐదు రోజులుగా ఢిల్లీ, ముంబయి నుంచి వచ్చిన కళాకారులు ఈ ఆలయ నమూనాను తీర్చిదిద్దారు. మందిరం అంతర్భాంగా సీతారామ, లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయం ఎదుట ఉన్న శ్రీరాముడి భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఈ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను నిర్వహించనున్నట్లు డాక్టర్‌ ముక్తియార్‌బాషా తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తుల కోసం తనకల్లు మండలం కొక్కంటి క్రాస్‌, అనమయ్య జిల్లా మొలకలచెరువు, కర్ణాటకలోని చాకివేలు నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement