ఉప్పొంగిన ప్రజా ఉద్యమం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై
ప్రజా ఉద్యమం ఉప్పొంగింది. వైద్యం
మా హక్కు...పీపీపీ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని చూస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు. పేదల పక్షాన వైఎస్సార్‌సీపీ చేపట్టిన
కోటి సంతకాల సేకరణకు ఊరూవాడా మద్దతు లభించింది. ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా లక్షలాది మంది మద్దతు
తెలుపుతూ సంతకాలు చేసిన ప్రతులు
జిల్లా కేంద్రానికి చేరాయి.
సాక్షి పుట్టపర్తి : ‘వైద్యం.. ప్రజల హక్కు’ నినాదంతో జిల్లా మార్మోగింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగింది. గ్రామగ్రామానా సంతకాల సేకరణ పెద్దఎత్తున సాగింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ (పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) పద్ధతిలో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే విధానాన్ని ఉపసంహరించుకోవాలని.. ప్రజలు డిమాండ్ చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి తీసుకున్న సంతకాల ప్రతులను బుధవారం జిల్లా కేంద్రానికి చేర్చారు.
కార్లతో భారీ ర్యాలీ..
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో పెనుకొండలోని మెడికల్ కాలేజీ నుంచి జాతీయ రహదారిలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం వరకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది కార్లతో వేలాది మంది జనాలతో పెనుకొండ పట్టణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పట్టణం దద్దరిల్లింది.
50 వేలకుపైగా సంతకాల సేకరణ..
పుట్టపర్తిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 50 వేల మందితో సంతకాలు సేకరించినట్లు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న చంద్రబాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.
ఉపసంహరించుకునే వరకు ఉద్యమం..
కదిరి నియోజకవర్గ కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సమన్వయకర్త బీఎస్ మక్బూల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 68 వేల మందితో సంతకాలు సేకరించినట్లు వెల్లడించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు.
బినామీలకు కట్టబెట్టేందుకే..
హిందూపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సమన్వయకర్త టీఎన్ దీపిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని 50 వేల మందికిపైగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారని దీపిక తెలిపారు. తన అనుయాయులకు కారుచౌకగా మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రైవేటీకరణ అంటూ జపం చేస్తున్నారని దీపిక మండిపడ్డారు.
ప్రభుత్వమే నిర్వహించాలి..
మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మడకశిర నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను బుధవారం జిల్లా కేంద్రం పుట్టపర్తికి తరలించారు.
ధర్మవరంలో భారీ ర్యాలీ..
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీ నుంచి కాలేజీ సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 62,358 మందితో సేకరించిన సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి పంపించారు.
ప్రజాగ్రహానికి గురికాక తప్పదు
రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన 64,670 సంతకాల ప్రతులను బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రం పుట్టపర్తికి పంపారు. అనంతపురం నుంచి ప్రత్యేక వాహనంలో వీటిని తీసుకెళ్లారు. పార్టీ నేత తోపుదుర్తి ఆత్మారామిరెడ్డి జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. ఈవిషయంలో చంద్రబాబు మొండిగా ముందుకు వెళ్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై
వైఎస్సార్ సీపీ పోరుబాట
ఊరూరా సంతకాల సేకరణ
ప్రతి నియోజకవర్గంలోనూ
వేలాది మంది మద్దతు
జిల్లా కేంద్రానికి చేరిన
కోటి సంతకాల ప్రతులు
పెనుకొండలో ఉషశ్రీచరణ్ భారీ ర్యాలీ
ఉప్పొంగిన ప్రజా ఉద్యమం
ఉప్పొంగిన ప్రజా ఉద్యమం
ఉప్పొంగిన ప్రజా ఉద్యమం


