ఉమ్మడి జిల్లాపై చలి పంజా
● మడకశిరలో 11.2, శెట్టూరులో 12.1 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లాలో చలి పంజా విసురుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతున్నాయి. పగలు, రాత్రి శీతల వాతావరణం నెలకొంది. వేకువజామున పొగమంచు అధికమవుతోంది. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో 11.2 డిగ్రీలు, అనంతపురం జిల్లా శెట్టూరులో 12.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విడపనకల్లు 12.2, సోమందేపల్లి 12.3, అమడగూరు 12.4, తనకల్లు 12.6, రొద్దం 12.7, కుందుర్పి, గుమ్మఘట్ట, గుడిబండ 13.1, ఓడీ చెరువు 13.2, నల్లచెరువు 13.4, అమరాపురం 13.5, వజ్రకరూరు 13.6, కళ్యాణదుర్గం, గాండ్లపెంట 13.7, రాప్తాడు 13.8 డిగ్రీలు... ఇలా చాలా మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మిగతా మండలాల్లో కూడా 14 నుంచి 17 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతున్నాయి.


