పదవి కోసం టీడీపీ పాకులాట | - | Sakshi
Sakshi News home page

పదవి కోసం టీడీపీ పాకులాట

Dec 8 2025 7:37 AM | Updated on Dec 8 2025 7:37 AM

పదవి కోసం టీడీపీ పాకులాట

పదవి కోసం టీడీపీ పాకులాట

సాక్షి, పుట్టపర్తి: రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం మరోసారి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 11న రామగిరిలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంపీపీ పదవి దక్కించుకునేందుకు ఈసారి టీడీపీ ఎన్ని అరాచకాలు తెరతీస్తుందోనన్న భయం అందరిలో నెలకొంది.

9 చోట్ల వైఎస్సార్‌సీపీ సభ్యుల గెలుపు

రామగిరి మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 9 చోట్ల వైఎస్సార్‌సీపీ సభ్యులు గెలిచారు. రామగిరి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచిన మీనుగ నాగమ్మను రామగిరి ఎంపీపీగా అప్పట్లో ఎన్నుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె మరణించడంతో ఎంపీపీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎంపీపీ పదవి మహిళకు రిజర్వేషన్‌ అయింది. ఎమ్మెల్యే పరిటాల సునీత వర్గీయులు ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీకి మద్దతు ఇవ్వాలని.. లేకపోతే ఇబ్బందులు పడతారని బెదిరింపులకు దిగారు. ఫలితంగా ఇప్పటికే.. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీడీపీ గూండాల బెదిరింపులకు భయపడి.. ఇప్పటికే ఊళ్లు ఖాళీ చేశారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలు ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది మార్చి 27న , మే 18న , జూలై 16న , ఆగస్టు 13న ఎన్నికలు జరగాల్సి ఉన్నా వాయిదా పడుతూనే ఉన్నాయి.

పదవి కోసం దొడ్డిదారిలో...

రామగిరి ఎంపీపీ స్థానానికి పోటీ చేసేందుకు టీడీపీ తరఫున అభ్యర్థి లేకున్నా.. ప్రతిసారీ బరిలో దిగుతున్నారు. ప్రతిపక్ష పార్టీ సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురి చేసి.. దొడ్డి దారిలో పదవి దక్కించుకోవాలని ఎమ్మెల్యే పరిటాల సునీత నానా ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా సభ్యురాలిని బెదిరించి.. పార్టీ ఫిరాయించే ప్రయత్నాలు ఇప్పటికే పలుమార్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎలాంటి పథకం పన్నుతారనే దానిపై అందరిలో భయాందోళన నెలకొంది.

ఎన్నికలంటే భయం.. భయం

రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక అంటే సభ్యులతో పాటు మండల వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. తొలిసారి ఉప ఎన్నిక సమయంలో పాపిరెడ్డిపల్లికి చెందిన కురుబ లింగమయ్యను టీడీపీ గూండాలు దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఎన్నిక నిర్వహించగా.. భయంతో సభ్యులు రాలేదు. తిరిగి జూలైలో మరోసారి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఎమ్మెల్యే పరిటాల సునీత అభ్యర్థి కోసం వెంపర్లాడి ప్రలోభాలకు గురి చేసినా ఎవరూ తలొగ్గలేదు. దీంతో అధికారులు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆగస్టులో ఉప ఎన్నిక నిర్వహించగా.. సభ్యులు డుమ్మా కొట్టడంతో వాయిదా పడింది. టీడీపీ గూండాలు తలపెట్టే రాక్షస క్రీడకు భయపడి.. ఎన్నికలకు రాం రాం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేయడం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

దొడ్డిదారిలో రామగిరి ఎంపీపీ పదవి దక్కించుకోవాలని పరిటాల సునీత ప్రయత్నాలు

ఎంపీటీసీ సభ్యులకు బెదిరింపులు

ఎన్నికల గొడవల్లో భాగంగా కురుబ లింగమయ్య దారుణ హత్య

ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఎన్నిక

తాజాగా ఈనెల 11న ఎంపీపీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌

బలం లేకున్నా బరిలో దిగి.. దొడ్డి దారిలో రామగిరి ఎంపీపీ పదవి దక్కించుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రామగిరి మండలంలోని ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికకు మరోసారి నోటిఫికేషన్‌ విడుదల కావడంతో మళ్లీ కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement