నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను ఈ సమర్పించుకోవచ్చన్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించుకొని పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అలాగే కలెక్టరేట్‌కు రాకుండా ఠీఠీఠీ. ఝ్ఛ్ఛజుౌట్చఝ. ్చఞ. జౌఠి. జీుఽ లో ఆన్‌లైన్ ద్వారా కూడా సమర్పించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్పీ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: స్థానిక పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో తెలియజేవచ్చని సూచించారు. అర్జీదారులు ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.
నకిలీ బర్త్ సర్టిఫికెట్ల
వ్యవహారంలో ట్విస్ట్
మడకశిర: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొమరేపల్లి గ్రామ పంచాయతీ లాగిన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ అయినట్లు గుర్తించారు.
తవ్వేకొద్దీ...
జిల్లా నోడల్ ఆఫీసర్ కళాధర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నకిలీ బర్త్ సర్టిఫికెట్ల విచారణలో తవ్విన కొద్దీ ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. 2020లో అగళి మండలంలోని కొమరేపల్లి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది. 2021లో ఈ పంచాయతీకి లాగిన్ ఇచ్చారు. అయితే ఈలాగిన్ ఉపయోగించి ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయలేదని ఇంతకు మునుపు పని చేసిన గ్రామ కార్యదర్శులు విచారణ అధికారుల ముందు హాజరై చెప్పారు. అసలు వీరు లాగిన్ ఉపయోగించకుంటే ఇదే లాగిన్ నుంచి బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయని విచారణ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 2021, 2022లో ఈలాగిన్‌లో మొత్తం 5 బర్త్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఇంతకు ముందే విచారణ అధికారులు గుర్తించారు. తాజాగా పుట్టపర్తి కేంద్రంగా ఆదివారం చేసిన విచారణలో మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇదే లాగిన్ నుంచి డెత్ సర్టిఫికెట్లు కూడా జారీ అయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. 2021లో రెండు డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. 2025లో 7 డెత్ సర్టిపికెట్లు జారీ అయినట్లు విచారణ అధికారులు గుర్తించారు. 2022, 2023, 2024లో డెత్ సర్టిఫికెట్లు ఈలాగిన్ నుంచి జారీ కాలేదు. ఈ నేపథ్యంలో విచారణ అధికారులు డెత్ సర్టిఫికెట్లు ఎవరు గ్రామ కార్యదర్శిగా ఉన్నప్పుడు జారీ అయ్యాయో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
నివేదిక సిద్ధం
కొమరేపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంగా జరిగిన నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంపై విచారణ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. 2025 జనవరి నుంచి అక్టోబర్ 14 వరకు 3,982 నకిలీ బర్త్ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయో అనే అంశంపై వారం రోజుల నుంచి అధికారులు విచారణ జరిపారు. పలువురిని విచారించారు. ప్రాథమికంగా విచారణ నివేదికను సిద్ధం చేసినట్లు సంబంధిత అధికారి ద్వారా తెలిసింది. ఈ విచారణ నివేదికను సోమవారం ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
బీటెక్ విద్యార్థికి విద్యుత్ షాక్
ధర్మవరం అర్బన్: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ బీటెక్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. ధర్మవరంలోని మారుతీనగర్‌కు చెందిన వెంకటస్వామి కుమారుడు రాజవంశీకృష్ణ అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం మిద్దైపె ఫోన్‌లో మాట్లాడుతూ అటుఇటు తిరుగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై కిందపడ్డాడు. వెంటనే స్థానిక ప్రభుత్స్పాత్రికి తీసుకెళ్లి.. వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక


