సాయీ నీ నామం..
ప్రశాంతి నిలయం: రష్యన్ సత్యసాయి భక్తులు సత్యసాయిని కీర్తిస్తూ నిర్వహించిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరంలోని భక్తులు పరవశించిపోయారు. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన రష్యా సత్యసాయి భక్తులు ఆదివారం సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరి నిర్వహించారు. తొలుత సత్యసాయి అష్టోత్తర నామాన్ని జపించారు. తర్వాత సత్యసాయిని కీర్తిస్తూ సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో వారు నిర్వహించిన సంగీత కచేరి అందరినీ ఆకట్టుకుంది.


