విద్యార్థుల భవితకు బాటలు వేయాలి
లేపాక్షి: తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమష్టిగా విద్యార్థుల భవితకు బాటలు వేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం లేపాక్షిలోని జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పీటీఎంలో ఆయన పాల్గొన్నారు. మెగా పీటీఎం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సంబంధం మెరుగుపడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా మొబైల్‌లో లీప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. దీనివల్ల విద్యార్థుల ప్రగతి తెలుసుకోవచ్చన్నారు. అలాగే హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డుల ఉపయోగం గురించి వివరించారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కలెక్టర్ సందర్శించి ఎగ్జిబిట్లను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.


