నేత్రపర్వంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం
కదిరి టౌన్: స్థానిక ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని రంగమంటపంలో శ్రీదేవి, భూదేవి సమేత వసంత వల్లభుని కల్యాణోత్సవాన్ని శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
నేటి నుంచి ప్రభుత్వ బడుల్లో
వంద రోజుల కార్యాచరణ
అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు శనివారం నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల కార్యాచరణకు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చి 15 వరకు ఈ ప్రణాళిక కొనసాగనుంది. 16 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లాలో అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలు 356 ఉండగా, మొత్తం 19,596 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలికలు 10,290 మంది, బాలురు 9,306 మంది ఉన్నారు. వీరికి ప్రణాళిక అమలులో భాగంగా ఉదయం 8 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్టడీ అవర్స్, రోజువారీ స్లిప్ టెస్టులు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు.
నాలుగు టన్నుల
రేషన్ బియ్యం స్వాధీనం
ధర్మవరం రూరల్: స్థానిక గూడ్స్‌షెడ్ కొట్టాల వద్ద గొట్లూరుకు వెళ్లే మార్గంలో బొలెరో, ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల రేషన్ బియ్యాన్ని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న విషయాన్ని గుర్తించిన ఆర్‌ఎస్‌ఎఫ్ నాయకుడు సాకే హరి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున తదితరులు వాహనాలను అడ్డుకుని సమాచారం ఇవ్వడంతో సీఎస్‌డీటీ చెన్నకేశవనాయుడు అక్కడకు చేరుకుని బియ్యం స్వాధీనం చేసుకుని వాహనాలను సీజ్ చేశారు.
నేత్రపర్వంగా ఖాద్రీశుడి కల్యాణోత్సవం


