ప్రాణాలు బలిగొన్న చేపల వేట
తలుపుల: చేపల వేట కోసం వెళ్లిన మత్స్యకారుడు మడుగులో చిక్కుకుని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు... తలుపుల మండలం వేపమానిపేటకు రామాంజులు (35), మరో వ్యక్తితో కలసి శుక్రవారం శింగనపల్లి సమీపంలోని తాటిమాను మడుగులో చేపల వేటకు వెళ్లారు. ఒక వైపున వదిలిన వలలో చేపలు పడని విషయం గుర్తించిన రామాంజులు మరోవైపు వల వేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో వలను తీసుకుని మడుగులో ఈదుకుంటూ ముందుకు సాగాడు. మధ్యలోకి వెళ్లగానే ఆయాసం ఎక్కువైంది. అదే సమయంలో మడుగులోని జమ్ములో పంచె చుట్టుకోవడంతో నీట మునిగాడు. విషయాన్ని గుర్తించిన తోడు వచ్చిన వ్యక్తి వెంటనే గ్రామానికి చేరుకుని స్థానికులను తోడు పిలుచుకుని వచ్చే లోపు మృతి చెందాడు. రామాంజులుకు భార్య రామక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంలో టీచర్ మృతి
మడకశిర: మండలంలోని ఆమిదాలగొంది జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోషియల్ టీచర్‌గా పని చేస్తున్న నాగేంద్ర గురువారం రాత్రి హిందూపురం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్, జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లీలాఇంద్రప్రసాద్, నాయకులు ప్రతాపరెడ్డి, మధు, శ్రీనివాసరెడ్డి, రాజేష్, ప్రకాష్‌రెడ్డి, సుబ్బారెడ్డి, సునీత, సుజాత, పీఆర్‌టీయూ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకులు రజనీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, దామోదర్, స్థానిక ఎంఈఓలు భాస్కర్, నరసింహమూర్తి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రాణాలు బలిగొన్న చేపల వేట


