కియా కార్మికుడి దుర్మరణం
పెనుకొండ రూరల్: పుట్టపర్తి మండలం కొట్లపల్లికి చెందిన నరసింహమూర్తి (32) కియా ట్రైనింగ్ సెంటర్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధుల్లో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆయన.. హరిపురం సమీపంలోకి చేరుకోగానే వాహనం అదుపు తప్పి కిందపడ్డాడు. స్థానికుల సమాచారంతో కియా పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై కియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


