పట్టు రైతులపై కనికరమేదీ?
పట్టు రైతుల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రైతులపై ఏమాత్రమూ కనికరం చూపడం లేదు. ప్రోత్సాహక సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్నాం. అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించి ఆదుకుంటామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా పైసా చెల్లించలేదు. ఇప్పటికై నా మాట నిలబెట్టుకోవాలి.
– వేమారెడ్డి, పట్టు రైతు,
పాపసానిపల్లి, మడకశిర మండలం
దశల వారీగా ఉద్యమం
ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక బకాయిలు రాబట్టడానికి దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పట్టుపరిశ్రమశాఖ ఏడీలను కలిసి వినతి పత్రాలు అందించాం. త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ కలిసి వినతిపత్రాలు ఇస్తాం. ప్రభుత్వం స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాం.
– వెంకట్రామిరెడ్డి, సోమ్‌కుమార్,
పట్టు రైతుల కమిటీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు
పట్టు రైతులపై కనికరమేదీ?
పట్టు రైతులపై కనికరమేదీ?


