మోడల్ పేపర్స్ ఆవిష్కరణ
పుట్టపర్తి: పదో తరగతి విద్యార్థుల కోసం యూటీఎఫ్ ప్రచురించిన మోడల్ టెస్ట్ పేపర్స్–2026 పుస్తకాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్, డీఈఓ కృష్ణప్ప శనివారం కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రతి ఏటా విద్యార్థుల కోసం అనుభవం ఉన్న టీచర్లతో మోడల్ టెస్ట్‌పేపర్స్ బుక్ రూపొందించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించేలా విద్యార్థులకు ఇప్పటి నుంచే ఉపాధ్యాయులు ప్రణాలికలు రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అధికారి దేవరాజ్, సంఘం గౌరవాధ్యక్షుడు భూతన్న, నారాయణస్వామి, లక్ష్మీనారాయణ, శివ, బాబు, అమర నారాయణరెడ్డి, చంద్రశేఖర కృష్ణతేజ, అమర్‌నాథ్‌రెడ్డి, సురేష్, సంజీవప్ప తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
దంపతులకు తీవ్ర గాయాలు
బత్తలపల్లి: మాల్యవంతం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్షసాక్షులు తెలిపిన మేరకు... అనంతసాగరం గ్రామానికి చెందిన గుజ్జల నాగేంద్రయ్య, నాగేంద్రమ్మ దంపతులు కూరగాయలను ఆటోలో వేసుకొని ఊరురా తిరుగుతూ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం ఆటోలో కూరగాయలు వేసుకొని మాల్యవంతం వైపు వెళుతుండగా ధర్మవరం నుంచి విద్యార్థులను తీసుకెళ్లే ఆర్టీసీ బస్సు వెనుకవైపు నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాగేంద్రయ్య, నాగేంద్రమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 వాహనంలో ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్షతగాత్రులను కలిసి ఘటనపై ఆరా తీశారు.
మోడల్ పేపర్స్ ఆవిష్కరణ


