నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం
పుట్టపర్తి టౌన్: ప్రతి పోలీసు అధికారీ నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. శనివారం పుట్టపర్తిలో సాయి ఆరామంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌లతో నెలవారీ సమీక్ష నిర్వహించి పాత కేసులు, పోక్సో కేసులు, మహిళా నేరాలు, రోడ్డు ప్రమాదాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ పెడింగ్ కేసుల్లో త్వరగా పురోగతి సాధించాలన్నారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలు, ప్రాపర్టీ నేరాలు, చోరీలు, గొడవలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు రౌడీషీటర్లపై దృష్టి సారించాలన్నారు. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తే నేరం చేసేందుకు భయపడతారన్నారు. పోలీసులు అంటే నేరస్తులకు భయం పుట్టే విధంగా పని చేయాలన్నారు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీలు సబ్‌డివిజన్ పరిధిలో రోజూ 10 కేసుల చొప్పున మానిటరింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీలు విజయకుమార్, మహేష్, హేమంత్‌కుమార్, నర్సింగప్ప, ఇందిర, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, లక్ష్మీకాంత్‌రెడ్డి, ఐటీ కోర్ టీమ్ ఇన్‌చార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేర సమీక్షలో ఎస్పీ సతీష్‌కుమార్
నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజల్లో నమ్మకం


