అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
ప్రశాంతి నిలయం: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30తో అక్రిడిటేషన్ కాలపరిమితి ముగియనుండగా... తాజాగా 2026, జనవరి 31 వరకు పొడిగించడం గమనార్హం.
ప్రశాంతంగా కార్యదర్శుల పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పని చేస్తున్న గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–5 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించి స్థానాల కేటాయింపునకు శుక్రవారం చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పంచాయతీ అధికారులు నాగరాజునాయుడు, సమత ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ చేపట్టారు. మొత్తం 120 మందికి గాను 119 మంది హాజరయ్యారు. సీనియార్టీ జాబితాను అనుసరించి కలెక్టర్ ఆమోదంతో పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తామని డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు.


