ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా : కలెక్టర్
ధర్మవరం అర్బన్: ఈవీఎంల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నెల వారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ధర్మవరం మార్కెట్‌యార్డులో ఈవీఎంలు భద్రపరిచిన గోదామును కలెక్టర్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ఫైర్ సేఫ్టీ, 24గంటల భద్రతా అంశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, తహసీల్దార్ సురేష్‌బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
చిగిచెర్లలో రాష్ట్ర స్థాయి
జూడో పోటీలు ప్రారంభం
ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం రాత్రి ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్పెక్టర్ మహబూబ్‌బాషా, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి, హరీష్‌కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాయిమనోహర్, హెచ్‌ఎం తిమ్మారెడ్డి, స్టేట్ అబ్జర్వర్ జయసింహ, పీడీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


