మున్సిపాలిటీలో కలిపితేనే అభివృద్ధి
జగనన్న కాలనీలను మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకువస్తే నిధులు అందుబాటులో ఉంటాయి. తద్వారా మౌలిక వసతులను మరింత మెరుగు పరిచే వీలుంటుంది. అందుకే వైఎస్సార్ సీపీ తరఫున మేం పోరాడుతున్నాం. కానీ వైఎస్సార్ సీపీకి మంచిపేరు వస్తుందోనని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. జగనన్న కాలనీలను మాత్రమే మున్సిపాలిటీలో విలీనం చేయాలని కౌన్సిల్ తీర్మానం చేసినా కమిషనర్ స్పందించడం లేదు. కానీ పేదలకు మేలు జరిగేంత వరకూ వైఎస్సార్‌సీసీ ఆధ్వర్యంలో పోరాడుతూనే ఉంటాం.
– చందమూరి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


