ఆక్రమించి.. ఇల్లు కట్టి | - | Sakshi
Sakshi News home page

ఆక్రమించి.. ఇల్లు కట్టి

Nov 28 2025 7:14 AM | Updated on Nov 28 2025 7:14 AM

ఆక్రమించి.. ఇల్లు కట్టి

ఆక్రమించి.. ఇల్లు కట్టి

పుట్టపర్తి మండలం పెడపల్లిలో ఓ టీడీపీ నేత భూ ఆక్రమణకు తెరలేపాడు. నిడిమామిడి రోడ్డులో ఆర్‌అండ్‌బీకి చెందిన స్థలం కొంత.. డిజిటల్‌ లైబ్రరీకి కేటాయించిన భూమిని మరికొంత గ్రామానికి చెందిన టీడీపీ నేత ఆక్రమించి ఓ పెద్ద భవనం నిర్మించాడు. దీనిపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్‌... కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు ఉన్న కలెక్టర్‌తో పాటు ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ కూడా కూల్చేయాలని ఆదేశించారు. అయితే ఆర్‌డీఓ, తహసీల్దార్‌ నిర్వాకంతో ఆ భవనం అలాగే ఉంది. అంతేకాకుండా పెడపల్లి మెయిన్‌ రోడ్డులో ప్రభుత్వ పాఠశాల సమీపంలోనూ మరో ఆక్రమిత భవనం ఉంది. దానిపై కూడా ఎలాంటి చర్యలు లేవు. అదేవిధంగా రాచువారిపల్లిలో ఓ దళితుడికి చెందిన భూమిని కొందరు ఆన్‌లైన్‌లో ఎక్కించుకుని మోసానికి పాల్పడ్డారు. బాధితుడు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement