●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ | - | Sakshi
Sakshi News home page

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

Nov 18 2025 7:04 AM | Updated on Nov 18 2025 7:04 AM

●బాబా

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

ఉరవకొండ: సత్యసాయి తనను తాను బాబాగా అవతార ప్రకటన చేసింది ఉరవకొండలోనే. 1926, నవంబర్‌ 23న పుట్టపర్తిలోని పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు నాల్గో సంతానంగా జన్మించిన సత్యనారాయణరాజు అక్కడికి దగ్గరలో ఉన్న బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత ఉరవకొండలోని శ్రీకరిబసవస్వామి బోర్డు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తన పెద్ద అన్న శేషమరాజు వద్దకు చేరుకుని దాదాపు ఏడాది పాటు అదే పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1940 అక్టోబర్‌ 20న పాఠశాలకు వెళ్లిన సత్యనారాయణరాజు.. తిరిగి ఇంటికి చేరుకుని చేతిలోని పుస్తకాల సంచిని లోపలకు విసిరేసి అక్కడికి సమీపంలోని అబ్కారీ బంగాళా వద్ద ఉన్న రాతి గుండుపై కూర్చొని ‘మాయ వీడింది.. నేను సత్యనారాయణను కాదు సత్య సాయిబాబాను, నా కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉంది. నన్ను నా భక్తులు పిలుస్తున్నారు నేను వెళ్తున్నానంటూ’ ధ్యానంలోకి వెళ్లిపోయారు. మానవజాతిని అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు నడిపించే గురుచరణములను ప్రవచించి, దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి ప్రయత్నించండి అంటూ తొలిసారిగా ‘మానస భజరే గురుచరణం’ గీతాన్ని భక్తులతో ఆలపింప చేశారు. సత్యనారాయణరాజు అవతార ప్రకటన విషయాన్ని శేషమరాజు ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు ఉరవకొండకు చేరుకుని బాబాను పుట్టపర్తికి పిలుచుకెళ్లారు. నాడు బాబా అవతార ప్రకటన చేసిన రాతి గుండుకు స్థానికులు పూజలు చేస్తూ వస్తున్నారు. ఆ ప్రాంతంలో 2003లో గురుచరణ భజన మందిరాన్ని డాక్టర్‌ నలబాల ఆంజనేయులు నిర్మించారు. అప్పటి నుంచి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ1
1/5

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ2
2/5

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ3
3/5

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ4
4/5

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ5
5/5

●బాబా అవతార ప్రకటనకు వేదిక ఉరవకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement