కొన.. సాగుతున్న ఏర్పాట్లు
పార్కు పనులు చేస్తున్న కూలీలు
చిత్రావతి నది వద్ద రోడ్డు పనులు చేస్తున్న హిటాచీ
పుట్టపర్తి అర్బన్: సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిలో చంద్రబాబు ప్రభుత్వం నత్తతో పోటీ పడుతోంది. శత జయంతి వేడుకలు ప్రారంభమై 6 రోజులైనా ఇప్పటికీ పట్టణంలో నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ 19న పుట్టపర్తికి విచ్చేస్తున్న నేపథ్యంలో ప్రధాన రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించి వాహన రాకపోకలను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. అయితే ఆయా రోడ్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటం.. హిటాచీలు, జేసీబీలు ట్రాక్టర్లు అడ్డు వస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్రావతి నదిని ఆనుకుని రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఇంకా తారువేయడంలోనే ఉన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, కలెక్టర్ ఏర్పాట్లపై పలు మార్లు సమీక్షలు చేసినా... కాంట్రాక్టర్లు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు.
● చిత్రావతి నది రహదారితో పాటు ఆర్టీసీ డిపో వద్ద ఏర్పాటు చేస్తున్న చిన్న పార్కు పనులు ఇంకా నాలుగు రోజులైనా పూర్తయ్యే అవకాశం లేదు. ఇప్పటికీ కూలీలు నిర్మాణ పనుల్లోనే కనిపిస్తున్నారు.
● రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తికి వచ్చే ప్రధాన రహదారి డివైడర్ల మధ్య మొక్కలు కత్తిరింపు పనులు కూడా సోమవారం నాటికీ పూర్తి కాలేదు.
● మామిళ్లకుంట క్రాస్ వద్ద డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు తొలగించడం, శుభ్రం చేసే పనులు రోజుల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. మరో 5 రోజుల్లో ఉత్సవాలు ముగుస్తాయని, ఆలోపైనా పనులు పూర్తి చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
కొన.. సాగుతున్న ఏర్పాట్లు


