రాప్తాడు రూరల్: మళ్లీ అధికారం దక్కడం కష్టమని తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నంతలో దోచుకునేందుకు తాపత్రయపడుతున్నారని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. సోమవారం అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో ఉన్న బీజీఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన నియోజకవర్గంలోని మాజీ స్టోర్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వలంటీర్లు, యానిమేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంల వల్లనే వైఎస్సార్‌సీపీ ఓడిపోయిందనే అభిప్రాయం చాలామందిలో ఉందన్నారు. ఇదే వాస్తమని నిర్ధారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ప్రకటించిన మేనిఫోస్టోను అధికారం చేపట్టిన తర్వాత అమలు చేయడంలో సీఎం చంద్రబాబు పూర్తిగా విఫలమలయ్యారన్నారు.
దోచుకోవడమే పరిటాల కుటుంబం విధానం
ఇది చివరి అవకాశంగా భావిస్తూ ఉన్నకాటికి ఊడ్చుకుని పోదాం. అందినకాటికి దోచుకుందాం అనే విధానంతో పరిటాల కుటుంబం పని చేస్తోందన్నారు. ప్రజలకు మంచి చేద్దామని కానీ, ఇచ్చిన హామీలు అమలు చేద్దామని కాని వారు ఆలోచించడం లేదన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో రూ. లక్ష కోట్ల దోపిడీకి సీఎం చంద్రబాబు రాజమార్గం ఏర్పాటు చేసుకున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంఽధ్ర, వెనుకబడిన జిల్లాల గురించి ఆలోచించడం లేదన్నారు.
జగనన్న లేని లోటు తెలుస్తోంది..
జగనన్న అధికారంలో లేనిలోటు రాష్ట్రమంతా తెలిసివచ్చిందన్నారు. గతంలో ఇళ్ల వద్దకే పథకాలు, ఆర్బీకేల ద్వారా ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు గ్రామాల్లోనే పంపిణీ చేసేవారన్నారు. నేడు కనీసం యూరియా కూడా ఇవ్వలేని అసమర్థత పాలన సాగుతోందని మండిపడ్డారు. ఎవరు రక్షకుడో, ఎవరు భక్షకులో పాపంపేట, కక్కలపల్లికాలనీ, చిన్మయానగర్ ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైందన్నారు. ఇప్పుడు మార్పు మొదలైందన్నారు. ఈ విషయం అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు మండలాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. సమావేశంలో అనంతపురం, రాప్తాడు, రామగిరి మండలాల కన్వీనర్లు బండి పవన్‌కుమార్, సాకే వెంకటేశు, మీనుగ నాగరాజు, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు గంగుల సుధీర్‌రెడ్డి, అమర్‌నాథరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఓబుగారి హరినాథరెడ్డి, ఎస్కేయూ లింగారెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ అధికారం దక్కదనే అరాచకం
ఇది చివరి అవకాశంగా
భావించిన పరిటాల కుటుంబం
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి
దోపిడీకి తెరలేపిన ఎమ్మెల్యేలు


