రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్: వరుసగా వెన్నాడుతున్న అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన ధనుంజయ (40)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మామిళ్లకుంట క్రాస్ సమీపంలో ఉన్న ప్రశాంతి రైల్వేస్టేషన్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తూ స్థానికంగానే క్వార్టర్స్‌లో కుటుంబంతో కలసి నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా అనారోగ్యం ఇబ్బంది పెడుతుండడంతో చికిత్స పొందారు. గతంలో గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో వైద్యులు స్టంట్ కూడా వేశారు. అయినా తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుండడంతో జీవితం విరక్తి పెంచుకున్న ఆయన బుధవారం ఉదయం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే కాపాడి సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తరలిస్తుండంగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఘటనపై కొత్తచెరువు ఆప్‌గ్రేడ్ సీఐ మారుతీశంకర్ కేసు నమోదు చేశారు.
జీవితంపై విరక్తితో..
ఓడీచెరువు: మండలంలోని మల్లెలవాండ్లపల్లికి చెందిన చింతా ఆదినారాయణరెడ్డి (55) ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంపై విరక్తితో
బుధవారం సాయంత్రం తన సొంత పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య సుగుణమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రైల్వే ఉద్యోగి ఆత్మహత్య


