ద్విచక్ర వాహనాల ఢీ – యువకుడి మృతి
సోమందేపల్లి: ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామానికి చెందిన ముత్యాలప్ప కుమారుడు గణేష్ (23) మంగళవారం రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లి, మొక్కు చెల్లించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయనపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిని దాటుకుంటుండగా పెనుకొండ వైపునుంచి వేగంగా వస్తున్న మరో బైక్ రైడర్ ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


