వీరభద్రుని సేవలో కర్ణాటక ఆర్టీఐ కమిషనర్
లేపాక్షి: స్థానిక వీరభద్రస్వామి ఆలయాన్ని కర్ణాటక ఆర్టీఐ కమిషనర్ మమత మంగళవారం ఉదయం సందర్శించారు. ఆలయ మర్యాదలతో ఆమెకు అర్చకులు స్వాగతం పలికారు. విశేష పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు.
విద్యార్థులకు ఆధార్ కష్టాలు
అగళి: పది, ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆధార్ కష్టాలు అడ్డంకిగా మారాయి. చాలా మంది విద్యార్ధుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్లలో పుట్టిన తేదీ, పేర్లలో తేడాలు ఉన్నాయి. దీంతో వీటిని సవరించుకునేందుకు విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. ఆయా పాఠశాలల్లోనే సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేసి ఆధార్ అప్‌డేట్ చేపట్టినా సాంకేతిక కారణాలతో ఇబ్బందులు తప్పడం లేదు. నెట్‌వర్క్ సమస్య కారణంగా ఈ రప్రకియ నత్తనడకన సాగుతోంది. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆధార్ అప్‌డేట్ చేస్తున్న సమయంలో నెట్‌వర్క్ సమస్య తలెత్తి సచివాలయ ఉద్యోగి బయట ద్విచక్ర వాహనంపై నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా ఆధార్ అప్‌డేట్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
బీసీ హాస్టల్ వార్డెన్ చేతివాటం
చిలమత్తూరు: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులు వినియోగించే ట్రంకు పెట్టెలను వాచ్‌మెన్ ద్వారా వార్డెన్ శ్రీనివాసులు విక్రయిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బీసీ హాస్టల్‌లో మంగళవారం ఓ వాహనంలో ట్రంక్ పెట్టెలు, డోర్లను లోడ్ చేస్తుండగా గమనించిన సీపీఎం నాయకులు నిలదీశారు. ఆ సమయంలో అవి హాస్టల్‌కు సంబంధించినవి కావని బుకాయించారు. పోలీసులకు సమాచారం ఇస్తామని నాయకులు తెలపడంతో కాళ్లబేరానికి వచ్చారు. విద్యార్థులకు సంబందించినవే అయినా పాడైపోతే గుజరీకి విక్రయిస్తున్నట్లుగా వివరించారు. ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి లీలావతి అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో వాచ్‌మెన్ తన తప్పును అంగీకరించాడు. హాస్టల్ వార్డెన్ సూచన మేరకే ఈ పనికి వాచ్‌మెన్ తెగించాడని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
వీరభద్రుని సేవలో కర్ణాటక ఆర్టీఐ కమిషనర్
వీరభద్రుని సేవలో కర్ణాటక ఆర్టీఐ కమిషనర్


