 
															జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు ఉపాధ్యాయులు
రామగిరి: కళాత్మకమైన విద్యా బోధన అంశంలో జిల్లాలోని ఇద్దరు ఉపాధ్యాయులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23, 24వ తేదీల్లో విజయవాడలో కళాత్మకమైన విద్యా బోధనపై ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఇందులో పేరూరు డ్యాంలోని ఏపీఆర్‌ఎస్ (మహాత్మా జ్యోతిబా పూలే) బాలుర పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు శ్రీరాములు, పూలమతి హైస్కూల్ ఉపాధ్యాయురాలు మెర్సీరాణి సంయుక్తంగా పాల్గొని తృతీయ స్థానంలో నిలిచారు. నవంబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి ప్రదర్శనలో తామిద్దరం పాల్గొననున్నట్లు శ్రీరాములు వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరచిన శ్రీరాములును ప్రిన్సిపాల్‌తోపాటు తోటి ఉపాధ్యాయులు అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
