 
															సత్యసాయి కీర్తిని చాటుతాం..
సత్యసాయి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటుతూ భక్తులు గర్వించేలా శతజయంతి వేడుకలు నిర్వహిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 200లకుపైగా దేశాల్లోని సత్యసాయి భక్తులు, సత్యసాయి సేవా కేంద్రాలున్నాయి. ఇప్పటికే ప్రశాంతి నిలయంలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 25 లక్షల మందికిపైగా భక్తులు వేడుకల్లో పాల్గొంటారన్న అంచనాతో ఆహారం, తాగునీరు, బస కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రముఖులు, పలువురు ఆధ్యాత్మిక వేత్తలు వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రతి సాయిభక్తుడూ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాం.
– ఆర్‌జె.రత్నాకర్ రాజు,సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
