 
															పిల్లల ప్రవర్తన గమనించాలి
పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు. ఏమి మాట్లాడుతున్నారు. పాఠశాలకు వెళ్తున్నారా? లేదా? అనే విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. సెల్‌ఫోన్‌లో వారు ఏమి చూస్తున్నారు? ఎవరికి మెసేజ్‌లు పంపుతున్నారనే దానిపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. ప్రధానంగా యుక్త వయసు అమ్మాయిలతో తల్లిదండ్రులు స్నేహంగా ఉంటే వారికి చెడు ఆలోచనలు రావు. – ప్రమీల, ఐసీడీఎస్ పీడీ
పరిచయం లేని వారితో చాటింగ్ వద్దు
అవసరం మేరకే పిల్లలు సెల్‌ఫోన్ వాడేలా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. వాటిని ఉపయోగిస్తున్నప్పుడు తల్లిదండ్రులు పక్కనే ఉంటూ గమనిస్తుండాలి. పరిచయం లేని వారితో చాటింగ్ చేయడం మంచిది కాదు. ప్రేమ మాయలో పడితే భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో తెలియజేసేందుకు ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, చైతన్య పరుస్తున్నాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పీ
 
							పిల్లల ప్రవర్తన గమనించాలి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
