 
															●జోడెద్దుల జోరు
● 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తిన ఎద్దులు
బొమ్మనహాళ్: జోడెద్దులు జోరుగా కదిలాయి. 8 గంటల్లో 20 ఎకరాల్లో అలసంద విత్తనాలు విత్తి సన్మానం అందుకున్నాయి. వివరాలు.. బొమ్మనహాళ్ మండలంలోని గోవిందవాడ గ్రామంలో చిన్న బసయ్య అనే రైతు 20 ఎకరాల ఇసుక నేలలో అలసందలు సాగు చేయాలని నిర్ణయించున్నాడు. అదే గ్రామానికి చెందిన ఎర్రిస్వామికి విత్తనాలు విత్తే పని అప్పగించాడు. ఎర్రిస్వామి, శివ, ఇస్సప్పతో కలిసి తన ఎద్దులతో గురువారం తెల్లవారుజామున 5 గంటలకు అలసంద విత్తనాలు విత్తే పనులను ప్రారంభించాడు. మధ్యాహ్నం ఒంటి గంటకల్లా 20 ఎకరాల్లో విత్తనాలు వేశాడు. విత్తనాలు వేయడానికి రేవప్ప, రాముడు, వన్నప్పల సహాయం కూడా తీసుకొన్నారు. సాధారణంగా ఎద్దులతో 20 ఎకరాల్లో విత్తనాలు విత్తాలంటే 20 గంటల వరకు పడుతుందని, ఎర్రిస్వామి ఎద్దులు కేవలం 8 గంటల్లో విత్తడం విశేషమని గ్రామస్తులు తెలిపారు. ఎద్దులకు పూలమాలలు వేసి గ్రామంలో ఊరేగించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
