 
															జూదరులపై ఉక్కుపాదం
● మొదటిసారి పట్టుబడితే
రూ.లక్షకు బైండోవర్
● మరోసారి పట్టుబడితే
రూ.10లక్షలు చెల్లించాల్సిందే
హిందూపురం: జూదరులపై ఉక్కుపాదం మోపుతా మని డీఎస్పీ మహేష్ హెచ్చరించారు. హిందూపురం పోలీసు సబ్‌డివిజన్ పరిధిలో జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో పలు చోట్ల దాడులు నిర్వహించామని చెప్పారు. హిందూపురం మండలం చౌలూరు, కారుడుపల్లిలో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ.10 లక్షలకు తహసీల్దార్ వద్ద బైండోవర్ చేసినట్లు వెల్లడించారు. జూదం ఆడేవారిని వదిలి పెట్టబోమన్నారు. కేసులు నమోదు చేస్తే ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతారని హెచ్చరించారు. తొలిసారి జూదమాడుతూ దొరికితే రూ.లక్షకు బైండోవర్ చేస్తామన్నారు. బైండోవర్ అయిన వారు మళ్లీ జూదంలో దొరికితే రూ.10 లక్షలు ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. డబ్బు కట్టని పక్షంలో జైలుకు వెళతారని చెప్పారు. పేకాట, మట్కా వంటి జూదం ఆడేవారిపై ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
జిల్లా అభివృద్ధికి కృషి
ప్రశాంతి నిలయం: అధికారులు, ప్రజాప్రతినిధుల అందరి సహకారంతో జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లో పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, పెనుకొండ ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బంది, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అంశాలపై జేసీ చర్చించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
