 
															‘తమ్ముడా మజాకా’పై కలెక్టర్ సీరియస్
● విచారణకు ఆదేశం
● నోటీసు జారీ చేస్తామన్న ఎంపీడీఓ
రాప్తాడు రూరల్: టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం మానసిక వికలాంగ కోటాలో అక్రమంగా పింఛన్ పొందుతున్న వైనంపై ‘తమ్ముడా మజాకా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం కలెక్టర్ ఓ.ఆనంద్ స్పందించారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో నివాసముంటున్న తాడాల నాగభూషణం పదేళ్లుగా ఈ పింఛన్ పొందుతున్నాడు. ఇప్పటి వరకూ పింఛన్లు పొందుతున్న వందశాతం వైకల్యం ఉన్న వేలాదిమంది దివ్యాంగులకు ఇటీవల నోటీసులు జారీ చేసిన కూటమి ప్రభుత్వం ... టీడీపీ నాయకుడు నాగభూషణం కు ఎలాంటి నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెవడంతో గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ దివాకర్ మాట్లాడుతూ విచారణలో భాగంగా నోటీసు జారీ చేస్తామని పేర్కొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
