సత్యసాయి శత జయంతి వేడుకలకు రండి
● ఉప రాష్ట్రపతిని ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులు
ప్రశాంతి నిలయం: సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొనాలంటూ భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్టన్‌ను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆహ్వానించారు. మంగళవారం ఢిల్లీలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌రాజు ఉప రాష్ట్రపతిని కలసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మానవాళికి అందిస్తున్న సేవా కార్యక్రమాలను ఆర్‌జే రత్నాకర్‌రాజు వివరించారు. సత్యసాయి బోధనలు, ఆధ్యాత్మిక తత్వాన్ని తరతారాలకు అందించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేస్తున్న కృషిని తెలియజేశారు. స్పందించిన ఉప రాష్ట్రపతి సత్యసాయి ట్రస్తు చేస్తున్న సేవలను కొనియాడారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు రత్నాకర్‌రాజు తెలిపారు.
‘సురక్ష’ యాప్ ద్వారానే
మద్యం విక్రయాలు
అనంతపురం సెంట్రల్: నకిలీ మద్యం నిర్మూలనకు కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారానే మద్యం అమ్మకాలు చేపట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్‌శాఖ ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశారు. సులువుగా మద్యం నాణ్యతను కనుక్కునే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు వివరించారు. ప్రతి మద్యం షాపు, బార్ లైసెన్స్‌దారుడు ఎకై ్సజ్ సురక్షయాప్ ద్వారానే మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించారు. వినియోగదారులు కూడా ఎలాంటి అనుమానాలున్నా యాప్ ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు.
అధ్యాపకులూ నిత్య విద్యార్థులే..
అనంతపురం: అధ్యాపకులూ నిత్య విద్యార్థులేనని జేఎన్‌టీయూ అనంతపురం వీసీ హెచ్.సుదర్శనరావు అన్నారు. అడ్వెంట్ గ్లోబల్ ఫౌండేషన్ క్యూ క్లైర్ ఓయాన్స్ , జేఎన్‌టీయూ అనంతపురం సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు అధ్యాపకులకు భావి నైపుణ్య శిక్షణ తరగతులు (అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్) నిర్వహిస్తున్నారు. మంగళవారం వీసీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్వాంటం టెక్నాలజీలో ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులకు పరిపూర్ణమైన అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. తొలి రోజు క్వాంటం టెక్నాలజీ అంశాలపై సీ–డాక్ ప్రాజెక్ట్ ఇంజినీర్ డాక్టర్ దివ్యాన్ష్ శ్రీనాలి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ఫ్యూచర్ స్కిల్ డెవలప్‌మెంట్, ఇంకుబేషన్ సెంటర్ డైరెక్టర్ సి. శోభాబిందు పాల్గొన్నారు.
సత్యసాయి శత జయంతి వేడుకలకు రండి


