పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుత్‌ ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుత్‌ ఉత్పత్తి

Oct 15 2025 5:34 AM | Updated on Oct 15 2025 5:34 AM

పీఏబీ

పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుత్‌ ఉత్పత్తి

దెబ్బతిన్న గేట్‌ లింక్‌

కూడేరు: పెన్నహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (పీఏబీఆర్‌) వద్ద ఏర్పాటైన ఏపీ జెన్‌కో జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయింది. డ్యాం నుంచి జల విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని సరఫరా చేసే ప్రాంతంలోని గేట్‌ లింక్‌ దెబ్బతింది. దీంతో నీటిని విడుదల చేయడానికి గేట్‌ పైకి లేవడం లేదు. గేట్‌ను పైకి ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 5న జల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించిన విషయం తెలిసిందే. మంగళవారం నాటికి 3 లక్షల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్లు ఏపీ జెన్‌ కో జేఈ కిరణ్‌ తెలిపారు. బుధ, గురువారాల్లో గేట్‌ లింక్‌కు మరమ్మతులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్‌, జెన్‌కో సివిల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరమ్మతులు పూర్తి కాగానే యథావిధిగా జల విద్యుత్‌ను ఒక టర్బైన్‌లో గంటకు 3 వేల చొప్పున రోజుకు సుమారు 72,500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని జేఈ కిరణ్‌ తెలిపారు.

29న రొళ్ల ఎంపీపీపై అవిశ్వాసం

రొళ్ల: స్థానిక మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానానికి ఈనెల 29న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తునట్లు ఎంపీడీఓ నాగేశ్వరావుశాస్త్రి తెలిపారు. ఇందులో భాగంగానే మండలంలోని 11 మంది ఎంపీటీసీలకు అధికారులు మంగళవారం నోటీసులను అందించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలను పదవి నుంచి తప్పించేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని జాయింట్‌ కలెక్టర్‌, ఆర్‌డీఓ, జిల్లా పరిషత్‌ సీఈఓ, స్థానిక ఎంపీడీఓకు మండలంలోని 8 మంది ఎంపీటీసీలు వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్‌డీఓ ఆనంద్‌కుమార్‌ ఉత్తర్వులు మేరకు ఎంపీడీఓ నాగేశ్వరావుశాస్త్రి ఆధ్వర్యంలో మండలంలోని 11 మంది ఎంపీటీసీలకు ఏఓ ప్రసాద్‌, ఈఓఆర్‌డీ శ్రీనాథ్‌ నోటీసులిచ్చారు.

పీఏబీఆర్‌లో ఆగిన  జల విద్యుత్‌ ఉత్పత్తి 1
1/1

పీఏబీఆర్‌లో ఆగిన జల విద్యుత్‌ ఉత్పత్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement