 
															గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి
కదిరి టౌన్: గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మంగళవారం కదిరి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కదిరి నియోజకవర్గ సమన్యయకర్త బీఎస్ మక్బూల్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా రమేష్‌రెడ్డి హాజరై మాట్లాడారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కదిరి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు పంచాయతీలకు ఒక పరిశీలకుడు ఉంటారని, పరిశీలకుల సమక్షంలోనే గ్రామ కమిటీలను ఎంపిక చేయాలన్నారు. అలాగే ప్రతి మండలానికి ఒకరు పరిశీలకులుగా వ్యవహరిస్తారని చెప్పారు. జంబ్లింగ్ పద్ధతిలో పరిశీలకులను నియమించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మండల పరిశీలకులను ఎంపిక చేశారు. కదిరి రూరల్‌కు శ్రీనివాసులు నాయుడు, తనకల్లుకు కేవీ ప్రణీత్‌రెడ్డి, నల్లచెరువుకు మాలే శ్రీకాంత్‌రెడ్డి, గాండ్లపెంటకు లింగాల లోకేశ్వర్‌రెడ్డి, ఎన్‌పీ కుంటకు డాక్టర్ బత్తల హరిప్రసాద్, తలుపులకు అత్తార్ చాంద్‌బాషాను నియమించారు.
వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ పరిశీలకులు రమేష్‌రెడ్డి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
