 
															అనుమతులు లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు
ప్రశాంతి నిలయం: దీపావళి పండుగ నేపథ్యంలో అనుమతులు తీసుకోకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్లో కలెక్టర్.. ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్‌తో కలసి దీపావళి సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ అధికారులు నిబంధనల మేరకు టపాసుల విక్రయ లైసెన్స్‌లు మంజూరు చేయాలన్నారు. టపాసులు విక్రయించే చోట ప్రమాదాలకు తావులేకుండా భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. టపాసుల విక్రయదారులు అనుమతుల మేరకే నిల్వ ఉంచుకోవాలని, గోడౌన్‌ల దగ్గర అన్ని సురక్షిత పద్ధతులు పాటించాలన్నారు. జన సంచారం ఉన్న ప్రాంతాల్లో, ప్రజల నివాసం ఉన్న చోట టపాసులు విక్రయించకూడదని స్పష్టం చేశారు. పోలీసు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా టపాసులు విక్రయించినా, నిల్వ ఉంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా టపాసుల విక్రాయాలపై ప్రజలు 112కు సమాచారం ఇవ్వొచ్చన్నారు.
కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
