 
															ప్రతిపాదనలు పంపాం
ప్రత్యామ్నాయ విత్తనాలతో పాటు రబీ సీజన్‌లో సాగు చేయడానికి సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద విత్తనాలు అవసరం ఉందని ప్రతిపాదనలు పంపాము. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే రైతులకు తెలియజేస్తాము. ఈశాన్య రుతుపవనాల్లో, తుపాను కారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ వర్షాలు కురుస్తాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– రామునాయక్, జిల్లా వ్యవసాయాధికారి
పెట్టుబడి కూడా దక్కలేదు
ఖరీఫ్‌లో నేను 3.5 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. భూమి సాగుకు, విత్తనాలకు, ఎరువులు, రోగాలు వచ్చినప్పుడు మందులు పిచికారీ, పంట తొలగించడానికి కూలీలకు సుమారు రూ.1.5 లక్షలు ఖర్చు చేశాను. చివరకు 22 బస్తాల వేరుశనగ కాయల దిగుబడి వచ్చింది. 45 కిలోల బస్తా రూ. 3 వేలతో అమ్మగా నాకు కేవలం రూ. 66 వేలు వచ్చింది. ఒక ట్రాక్టరు వేరుశనగ గడ్డి వచ్చింది.పెట్టుబడిలో సగం కూడా రాలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– దాసిరెడ్డి, రైతు, బీడుపల్లి
 
							ప్రతిపాదనలు పంపాం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
