 
															పూజారి ముసుగులో గంజాయి విక్రయం
గుంతకల్లు: ఆలయ పూజారి ముసుగులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తితో పాటు మరొకరిని ఎకై ్సజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ఎకై ్సజ్ సీఐ శివసాగర్ వెల్లడించారు. సోమవారం గుంతకల్లులోని హనుమన్ సర్కిల్‌లో తనిఖీలు చేపట్టిన సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే అడ్డుకుని పరిశీలించారు. వారి వద్ద 4 కిలోల ఎండు గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఏలూరు జిల్లా వెంకటాపురంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న పూజారి సురేష్‌బాబు కుమారుడు తిరునగరి మోహన్‌సుందర్ జల్సాలకు అటువాటు పడి పలు దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకుని గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామ రామాలయంలో అర్చకుడిగా చేరాడు. ఈ క్రమంలో ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చి అబ్బేదొడ్డికి చెందిన సాయిరామ్ అలియాస్ గంజాయి సాయి ద్వారా గుత్తి, గుంతకల్లు పట్టణాల్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం మొదలు పెట్టాడు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఇద్దరి అరెస్ట్.. 4 కిలోల గంజాయి స్వాధీనం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
