
అనుమానాస్పద మృతి
సోమందేపల్లి: మండలంలోని పత్తికుంటపల్లి బస్టాండ్ సమీపంలో మోరీ కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి (45) అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. మంగళవారం అటుగా వెళ్లిన గ్రామస్తులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ముక్కులో రక్తం రావడంతో పాటు శరీరంపై మూగ దెబ్బలను గుర్తించారు. విచారణ అనంతరం మృతుడిని హిందూపురం ప్రాంతానికి చెందిన సుబేద్‌గా నిర్ధారించారు. ఏదైన గొడవలో గాయపడి మృతి చెందడంతో మృతదేహాన్ని మోరీ కింద పడేసి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అది సాధారణ మరణమేనని పోలీసులు పేర్కొన్నారు.
● పుట్టపర్తి టౌన్: స్థానిక మున్సిపాల్టీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జగనన్న కాలనీలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బ్రాహ్మణపల్లి తండాకు చెందిన నారాయణ నాయక్ కుమారుడు బాలాజీ నాయక్ (38)కు భార్య గాయత్రి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో మంజూరైన ఇంటిలో నివాసముంటూ పెయింటింగ్ పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. సోమవారం రాత్రి భోజనం ముగించుకున్న అనంతరం భార్యాపిల్లలతో కలసి మిద్దైపె నిద్రకు ఉపక్రమించాడు. అర్దరాత్రి సమయంలో భార్య గట్టిగా కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే బాలాజీనాయక్ తలపై సిమెంట్ దిమ్మెతో మోది మిద్దె పైనుంచి కిందకు తోసేయడాన్ని గమనించి, కుటుంబ సభ్యులతో కలసి ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న సీఐ శివాంజనేయులు మంగళవారం ఉదయం జగనన్న కాలనీకి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశఋలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, భార్య గాయత్రి, ఆమె తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి (20) అదే కళాశాల హాస్టల్ గదిలో మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.